రామ్ చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా: పవన్ కల్యాణ్

కరోనా వైరస్ పై పోరాటానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు ఈ విరాళాన్ని ఇవ్వనున్నాడు. కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు చేస్తున్న కృషి అమోఘమని కితాబిచ్చాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తాను ఈ విరాళాన్ని ఇస్తున్నానని చెప్పాడు.
సీఎంల సహాయనిధికి రామ్ చరణ్ విరాళాన్ని ప్రకటించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంతోషాన్నివెలిబుచ్చారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించిన చరణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని సహాయనిధికి రూ. 1 కోటి, టీఎస్ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags: Pawan Kalyan,Ramcharan,Corona Virus,Donations,Tollywood