కీర్తి సురేశ్ ‘మిస్ ఇండియా’ రిలీజ్ డేట్

Keerthi Suresh,Vijay Ram, Malavika,Raj Tarun

* అందాలతార కీర్తి సురేశ్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మార్చి 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* ఆమధ్య విజయ్ సరసన ‘బిగిల్’ చిత్రంలో నటించిన అమృత అయ్యర్ టాలీవుడ్ లో ప్రవేశిస్తోంది. రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘రెడ్’ చిత్రంలో ఓ నాయికగా అమృతను ఎంపిక చేశారు. ఇప్పటికే ఇందులో కథానాయికలుగా నివేద పేతురాజ్, మాళవిక శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే.
* రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. కొండా విజయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేస్తారు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా, హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తోంది.
Tags: Keerthi Suresh,Vijay Ram, Malavika,Raj Tarun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *