ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్ డౌన్ కంటిన్యూ!

Lockdown,Continue,Narendra Modi,April 15

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రకటించి, ఏప్రిల్ 15 వరకూ దీన్ని పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 15తో లాక్ డౌన్ ముగియబోదని, ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అంచనా వేశారు.

ఇదే సమయంలో ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ఇండియా ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్న విషయమై ఓ అవగాహన వస్తుందని, యూఎస్, ఇటలీ వంటి దేశాల్లో మాదిరిగా, పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సరైన చర్యలే తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైరస్ బాధితుల సంఖ్య వేలల్లోకి, లక్షల్లోకి చేరితే, కనీస మౌలిక వైద్య సదుపాయాలు అందించే స్థితిలో భారత్ లేదని, ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా చూస్తూ, ముందుగానే నియంత్రణలో ఉంచేందుకు ఈ లాక్ డౌన్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
Tags: Lockdown,Continue,Narendra Modi,April 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *