జగన్ సర్కారుకు చుక్కెదురు… కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసులను తరలించాలని గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
Tags: Andhra Pradesh,High Court,Kurnool,Stay,Offices Shift